‘తెలుగు యూనివర్శిటీకి సురవరం పేరు హర్షనీయం’

తెలుగు యూనివర్శిటీకి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Update: 2024-09-20 14:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు యూనివర్శిటీకి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమ స్ఫూర్తి, పోరాట జ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు. సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో అనేక పుస్తకాలు రచించారని, తన రచనలతో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం.. వనపర్తి నుంచి తొలి ఎమ్మెల్యేగా 1952లో ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సురవరం పేరు తెలుగు యూనివర్శిటీకి పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.


Similar News