తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్‌కు స్కోచ్ అవార్డు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ అనుబంధ డిజిథాన్‌కు మ‌రోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. డిజిథాన్ ద్వారా నిర్వహించిన తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్‌కు స్కోచ్ అవార్డు సొంత‌మైంది. ఈ అవార్డును బుధవారం నారాయణపేట కలెక్టర్ హ‌రిచంద‌న స్వీక‌రించారు. గ‌త కొద్దికాలంగా కోడింగ్స్ స్కిల్స్ యొక్క ఆవ‌శ్యకత పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోరుకునే వారికి కోడింగ్ అక్షరాస్యత తప్పనిసరి అయ్యింది. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని పలు […]

Update: 2020-12-23 06:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ అనుబంధ డిజిథాన్‌కు మ‌రోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. డిజిథాన్ ద్వారా నిర్వహించిన తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్‌కు స్కోచ్ అవార్డు సొంత‌మైంది. ఈ అవార్డును బుధవారం నారాయణపేట కలెక్టర్ హ‌రిచంద‌న స్వీక‌రించారు. గ‌త కొద్దికాలంగా కోడింగ్స్ స్కిల్స్ యొక్క ఆవ‌శ్యకత పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోరుకునే వారికి కోడింగ్ అక్షరాస్యత తప్పనిసరి అయ్యింది. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కోడింగ్ స్కిల్స్ శిక్షణ విధానాన్ని డిజిథాన్ అమలు చేసింది. ప్రభుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్ ఓన‌మాలు తెలియ‌ని ద‌శ నుంచి కోడ్ రాసే స్థాయికి తీర్చిదిద్దారు. సొంతంగా గేమ్స్‌, యానిమేష‌న్స్ రూప‌క‌ల్పన చేయడం ఈ శిక్షణ లక్ష్యం.

ఇందులో భాగంగా కంప్యూట‌ర్ ఎలా పని చేస్తుంద‌నే ప్రాథ‌మిక అంశం నుంచి శిక్షణను ప్రారంభించి, క‌మ్యూనికేష‌న్ ఎలా ఉంటుంది, మ‌నిషికి-మెషిన్‌కు అనుసంధానంగా ఉన్న భాష ఏంటి? దీన్ని ఏ విధంగా అమ‌లు చేయాలి, ప్రోగ్రామ్ అంటే ఏమిటి? అల్గరిథం అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాస్తారు అనే అంశాలు నేర్పించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ చేసిన స్క్రాచ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఈ నైపుణ్యాలు నేర్పించారు. టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో టెక్కీ‌లకు‌, వ‌న‌ప‌ర్తి విద్యార్థుల‌కు క్లాస్‌రూం ట్రైనింగ్‌, మ‌క్తల్​‌లో ఆన్‌లైన్ శిక్షణ అందించ‌డం త‌మ‌కు స‌వాల్‌గా నిలిచింద‌న్నారు. ఐతే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో నేర్చుకున్నార‌ని సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News