రోజు విడిచి రోజు.. ఒంటిపూట తరగతులు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా గత మార్చిలో దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూతబడ్డాయి. భారత్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా కేంద్రం పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. అన్‌లాక్ 4.0లో భాగంగా పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా.. పిల్లలను పంపించడం, పంపించకపోవడం అనే బాధ్యతను పేరెంట్స్‌ ఇష్టానికే వదిలేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రోజు విడిచి రోజు […]

Update: 2020-10-29 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా గత మార్చిలో దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూతబడ్డాయి. భారత్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా కేంద్రం పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. అన్‌లాక్ 4.0లో భాగంగా పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా.. పిల్లలను పంపించడం, పంపించకపోవడం అనే బాధ్యతను పేరెంట్స్‌ ఇష్టానికే వదిలేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రోజు విడిచి రోజు స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయని, అందులో కూడా ఒంటి పూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్ విద్యార్థులకు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పూర్తి చర్యలు తీసుకుంటూ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తామన్నారు. మరల నవంబర్ 23 నుంచి 6, 7, 8వ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది.

Tags:    

Similar News