ఏపీలో విద్యా సంస్థలు బంద్

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అయితే ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పదో పరీక్షలు యధాతథంగా జరుగుతాయన్నారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 31 తరువాత మరోసారి సమీక్షించి సెలవుల విషయంతో తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 2 కరోనా పాజిటివ్ కేసులు […]

Update: 2020-03-19 02:09 GMT

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అయితే ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పదో పరీక్షలు యధాతథంగా జరుగుతాయన్నారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 31 తరువాత మరోసారి సమీక్షించి సెలవుల విషయంతో తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags: carona, ap, minister, suresh

Tags:    

Similar News