సమయానికి తెరుచుకోని స్కూల్స్.. నీరుగారుతున్న ప్రభుత్వం లక్ష్యం..
దిశ, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం 9:15 అయినప్పటికీ పాఠశాలకు తాళం వేసి తలుపులు మూసి ఉండడంతో, విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు. పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో ఆరుబయటే ఎక్కువగా తిరుగుతున్నారని ఆరోపించారు. బడిలో పిల్లలను చూసుకోవాల్సిన టీచర్లే నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థులు ఆరుబయట తిరుగుతున్నారన్నారు. కరోనా ఇటీవల […]
దిశ, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం 9:15 అయినప్పటికీ పాఠశాలకు తాళం వేసి తలుపులు మూసి ఉండడంతో, విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు. పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో ఆరుబయటే ఎక్కువగా తిరుగుతున్నారని ఆరోపించారు.
బడిలో పిల్లలను చూసుకోవాల్సిన టీచర్లే నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థులు ఆరుబయట తిరుగుతున్నారన్నారు. కరోనా ఇటీవల విజృంభించడంతో.. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలని కూడా అందుబాటులో ఉండే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కొంతమేర పెగింగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదే విషయంపై ఉపాధ్యాయులను వివరణ కోరగా పాఠశాలలో స్కావెంజర్ లేకపోవడంతోనే తాళాలు వేసి ఉంటున్నాయని తెలిపారు.