Central Minister : కాంగ్రెస్ అంటేనే అబద్దాలు

కాంగ్రెస్ అంటేనే అబద్దాలు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-11-05 10:56 GMT

దిశ, రుద్రంగి : కాంగ్రెస్ అంటేనే అబద్దాలు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రుద్రంగిలో మంగళవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. బస్ స్టాండ్ వద్ద వెజిటేబుల్ మార్కెట్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే బతుకమ్మ కుంట రోడ్డులో EGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్డులను ప్రారంభించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లగా ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే ముందు ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

    అబద్దాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రలో యాడ్ లు ఇచ్చి ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. 22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతుండగా ఇచ్చిన హామీలు నెరవేర్చామని మహారాష్ట్రలో ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ మర్చిపోయిందని ప్రజలు గమనించాలని కోరారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని అన్నారు.

    అది నారాయణ అల్లుడికి కాంట్రాక్టు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్లాన్ అని ఆరోపించారు. ఇప్పటికే కాళేశ్వరంపై కేసీఅర్ చేసిన అప్పు రూ.90 వేల కోట్లు ఉందని అన్నారు. మళ్లీ అప్పు చేస్తే ఎవరు కట్టాలని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ లకు అప్పులు కావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ అని, కానీ నేడు వారికి మద్దతుగా ఆ పార్టీ నేతలే ఆందోళన చేయడం సిగ్గు చేటు అన్నారు. బీఆర్ఎస్ మోసపూరిత విధానాలను మాజీ సర్పంచ్ లు నమ్మవద్దని అన్నారు. కేసీఅర్ కుటుంబం అంటేనే తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.

    శంషాబాద్ లోని ఎయిర్ఫోర్ట్ కాలనీలో ఆంజనేయ గుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అదే వేరే మతంపై జరిగితే వారు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్​చార్జ్ చెనమ్మనేని వికాస్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్, సీనియర్ నాయకులు పడల గణేష్, అల్లూరి అశోక్ రెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News