కరోనా ఎఫెక్ట్.. కేరళలో పాఠశాలలు బంద్

కేరళ రాష్ర్టంలో ఈ నెల 31వరకూ విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆ రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శబరిమలకు వచ్చే భక్తులు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. భక్తులు అధికంగా వచ్చే ఆలయాల ఉత్సవాలను రద్దు చేసుకోవాలని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు సూచనలు చేసింది. పాఠశాలతో పాటు సినిమా థియేటర్లనూ ఈ నెల 31వరకూ మూసివేశారు. ఈ మేరకు మలయాళ సినీ సంస్థల సమావేశంలో […]

Update: 2020-03-10 19:45 GMT

కేరళ రాష్ర్టంలో ఈ నెల 31వరకూ విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆ రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శబరిమలకు వచ్చే భక్తులు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. భక్తులు అధికంగా వచ్చే ఆలయాల ఉత్సవాలను రద్దు చేసుకోవాలని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు సూచనలు చేసింది. పాఠశాలతో పాటు సినిమా థియేటర్లనూ ఈ నెల 31వరకూ మూసివేశారు. ఈ మేరకు మలయాళ సినీ సంస్థల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

tags : School, movie theaters Bandh, kerala govt, coronavirus, 31st march

Tags:    

Similar News