ఏపీలో స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభమయ్యాయి. దాదాపు దాదాపు 8 నెలల తర్వాత తెరుచుకున్నాయి. నేడు 9,10 తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కరోనా నిబంధనలతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో తరగతిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు.. వారంతా ఆరడుగుల దూరం పాటించాలని సూచించింది. నవంబర్ 16 నుంచి […]
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభమయ్యాయి. దాదాపు దాదాపు 8 నెలల తర్వాత తెరుచుకున్నాయి. నేడు 9,10 తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కరోనా నిబంధనలతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో తరగతిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు.. వారంతా ఆరడుగుల దూరం పాటించాలని సూచించింది.
నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ కాస్లులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి 6,7,8 తరగతుల రెసిడిన్షియల్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులను నిర్వహించనున్నారు. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుంది.