‘బంగారు’ దొంగ భక్తుడు.. రూ. 2 లక్షలు దేవుడికిచ్చాడు

దిశ రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో కస్టమ్స్ అధికారుల వద్ద తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ. 32లక్షలతో ఉడాయించిన నిందితుడు, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. స్కామ్ చేసిన డబ్బుల్లో నుంచి రూ. 2 లక్షలు వారణాసిలోని ఓ దేవాలయ హుండీలో వేయడం గమనార్హం. డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల […]

Update: 2021-08-05 10:32 GMT

దిశ రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో కస్టమ్స్ అధికారుల వద్ద తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ. 32లక్షలతో ఉడాయించిన నిందితుడు, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. స్కామ్ చేసిన డబ్బుల్లో నుంచి రూ. 2 లక్షలు వారణాసిలోని ఓ దేవాలయ హుండీలో వేయడం గమనార్హం.

డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

కడప జిల్లాకు చెందిన ఆవూరు సుధాకర్ కస్టమ్స్ అధికారుల వద్ద తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తాను అంటూ మాయమాటలు చెప్పేవాడు. ఈ నేపథ్యంలోనే గత మూడేండ్ల క్రితం ఓ వ్యక్తి దగ్గర రూ. 6 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. ఇదే తరహాలో మరోసారి భారీ ప్లాన్ వేశాడు సుధాకర్. రమణ అనే వ్యక్తి ద్వారా రాంప్రసాద్‌తో పరిచయం పెంచుకొని మళ్లీ కస్టమ్స్ అధికారులు తెలుసు అంటూ నమ్మబలికాడు. అతడి మాటలు విన్న రాంప్రసాద్ రూ. 32 లక్షలు తీసుకొని నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న సుధాకర్ రూ. 32 లక్షలు తీసుకొని ఉడాయించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

డబ్బులు తీసుకొని నేరుగా కడపకు వెళ్లిన సుధాకర్ రూ. 2 లక్షలు పెట్టి భార్యకు నాలుగు తులాల బంగారు చైన్‌ బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత అందులో నుంచి మరో రూ. 2 లక్షలను వారణాసిలోని ఓ దేవాలయ హుండీలో వేశాడు. ఐదు రోజులు వారణాసిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 5న నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇదే సమయంలో ఆవూరి సుధాకర్ కడప వెళ్లేందుకు బస్టాండ్‌లో నిలబడి ఉండగా.. అతడిని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌కు సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Tags:    

Similar News