SBI Home loans: గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు పండుగ సీజన్ సమయంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుని కేవలం 6.70 శాతం వడ్డీతో గృహ రుణాలను అందించనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. అంతేకాకుండా ఈ రుణాలకు జీరో ప్రాసెసింగ్ ఫీజుతో అందించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. గతంలో రూ. 75 లక్షలకు పైన గృహ రుణానికి 7.15 శాతం వడ్డీ రేటు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు పండుగ సీజన్ సమయంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుని కేవలం 6.70 శాతం వడ్డీతో గృహ రుణాలను అందించనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. అంతేకాకుండా ఈ రుణాలకు జీరో ప్రాసెసింగ్ ఫీజుతో అందించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. గతంలో రూ. 75 లక్షలకు పైన గృహ రుణానికి 7.15 శాతం వడ్డీ రేటు ఉండగా, పండుగ సీజన్ సందర్భంగా దీన్ని 6.70 శాతానికే గృహ రుణాన్ని అందించనుంది. రూ. 75 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధితో పొందవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ ఆఫర్ వల్ల 45 బేపీఎస్ పాయింట్ల ఆదాతో పరోక్షంగా రూ. 8 లక్షల వరకు భారీగా వడ్డీని రుణగ్రహీతలు ఆదా చేసుకోవచ్చని ఎస్‌బీఐ వివరించింది.
అంతేకాకుందా, ఇదివరకు వేతనం లేని రుణ గ్రహీతలకు వేతనదారుల కంటే ఎక్కువగా వడ్డీ రేటులో 15 బీపీఎస్ పాయింట్ల వ్యత్యాసం ఉండేది. తాజాగా దీన్ని తొలగిస్తున్నట్టు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఆఫర్ ద్వారా పండుగ సీజన్ సమయంలో వినియోగదారులు, రుణ గ్రహీతలకు ప్రయోజనాలు ఉంటాయని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. ‘ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఆఫర్లను మరింత సరళతరం చేశాం. ఇదివరకు రుణ మొత్తానికి పరిమితి అంటూ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించాం. అలాగే, వేతనదారులకు, వేతనం లేని వారికి మధ్య ఉండే వడ్డీ రేటును తొలగించామని’ ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి వెల్లడించారు.