SBIఖాతాదారులు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం ఎప్పటివరకంటే ?

దిశ,వెబ్‌డెస్క్ : ఎస్‌బీఐ బ్యాంకు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది.  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా జూలై 10వ తేదీ నుంచి 11 గంటల వరకు ఎస్‌బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవని పేర్కొంది. పాస్‌వర్డ్ […]

Update: 2021-07-10 02:34 GMT

దిశ,వెబ్‌డెస్క్ : ఎస్‌బీఐ బ్యాంకు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా జూలై 10వ తేదీ నుంచి 11 గంటల వరకు ఎస్‌బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవని పేర్కొంది.

పాస్‌వర్డ్ మార్చండి..

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో పద్ధతిలో మోసగాళ్లు నేరాలు చేస్తున్నారు. ప్రజలు హ్యాకర్ల మాటలు నమ్మి నట్టేటమునుగుతున్నారు. బ్యాంకుఖాతా రహస్య వివరాలు చెప్పినగదును పోగొట్టుకుంటున్నారు. ఈ మెయిల్స్‌, ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు, వాట్సాప్‌ల ద్వారా అమాయక ప్రజల ఖాతాలను సైబర్‌ కిలాడీలు కొల్లగొడుతున్నారు. తప్పుడు మెసేజ్‌లతో మన పూర్తివివరాలు సేకరించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ నేపథ్యంలోఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్లకు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను తరచూ మార్చుకోవాలని సూచించింది. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పాస్ వర్డ్‌లు మార్చుకోవాలని ఖాాతాదారులను కోరింది.

Tags:    

Similar News