నిల్వలు తగ్గిపోయాయి..అప్పులే గతి!
ఇప్పటికే కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. డిమాండ్ కూడా పూర్తీగా పడిపోయింది. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఆయా దేశాల్లో స్టొరేజ్ నిల్వలు పెరిగిపోయాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలోనే ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా ఫారిన్ అసెట్స్ 2000 తర్వాత మార్చి నెలలో తొలిసారిగా తగ్గిపోయాయి. అంటే, చమురు ధరలు తగ్గిపోవడం వల్ల ఉత్పత్తి […]
ఇప్పటికే కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. డిమాండ్ కూడా పూర్తీగా పడిపోయింది. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఆయా దేశాల్లో స్టొరేజ్ నిల్వలు పెరిగిపోయాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలోనే ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా ఫారిన్ అసెట్స్ 2000 తర్వాత మార్చి నెలలో తొలిసారిగా తగ్గిపోయాయి. అంటే, చమురు ధరలు తగ్గిపోవడం వల్ల ఉత్పత్తి దేశాల ఆర్థికవ్యవస్థపై ఎంత నష్టం వాటిల్లిందో అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. 2011 తర్వాత అత్యంత కనిష్టంగా 100 బిలియన్ రియాల్స్(27 బిలియన్ డాలర్లు) నిల్వలు తగ్గి 464 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు తెలుస్తోంది.
రెండు దశాబ్దాల కనిష్టానికి..
ఈ ఏడాదిలో 120 బిలియన్ రియాల్స్ తగ్గే అవకాశముందని గత వారం సౌదీ ఆర్థికమంత్రి మహమ్మద్ అల్ జదాన్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతిదారైన సౌదీ ఖర్చులు తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల కనిష్టానికి చమురు ధరలు దిగజారుతుండటం వల్ల ఆర్థిక పరిస్థితి వినాశకరంగా ఉందని, రెండు దశాబ్దాల కనిష్టానికి సౌదీ నిల్వలు చేరుకున్నాయని సౌదీ ఆర్థికమంత్రి వివరించారు.
అమ్మకాల్లేవు..
బ్రెంట్ క్రూడాయిల్ ధరలు మార్చి నెలలో 50 శాతం కుప్పకూలాయి. ఈరోజుకి అది మరింత క్షీణించింది. బ్యారెల్ ధర 20 డాలర్ల వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సౌదీ తమ బడ్జెట్‌ను సమతుల్యం చేసుకోవాలంటూ సూచించింది. సౌదీతో పాటు చమురు ఉత్పత్తి చేసే అన్ని దేశాలు క్రూడాయిల్ బ్యారెల్‌కు 50 డాలర్ల నుంచి 70 డాలర్లకు అంచనాతో బడ్జెట్‌ను రూపొందించాయి. ప్రస్తుతం బ్యారెల్ 20 డాలర్లకు పడిపోవడం కంటే దారుణంగా అమ్మకాలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా కుప్పకూలుతున్నాయి.
ఊహించని షాక్…
ప్రభుత్వ అంచనాలను దాటి రెవెన్యూ భారీ స్థాయిలో తగ్గుతుందని, తాము 220 బిలియన్ రియాల్స్ వరకూ రుణాలను పెంచుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సౌదీ ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. తమ బడ్జెట్‌కు అనుకోని షాక్ అని, ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు అంతర్జాతీయ బాండ్ మార్కెట్‌ను చేరుకున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే, స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి 19 బిలియన్ డాలర్లు సౌదీ ప్రభుత్వం సేకరించింది.
Tags: Saudi Arabia, Oil Reserves, Saudi Arabia Spending, Foreign Assets, Debt