ప్రజలకు జవాబుదారీ టీఆర్ఎస్ ప్రభుత్వం: మంత్రి సత్య వతి రాథోడ్
దిశ, వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ అవాకులు, చవాకులు మాట్లాడే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన కర గుండ్రాతిమడుగులో మీడియా ప్రతినిధులకు మాస్క్‌లు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కష్ట కాలంలో కూడా […]
దిశ, వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ అవాకులు, చవాకులు మాట్లాడే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన కర గుండ్రాతిమడుగులో మీడియా ప్రతినిధులకు మాస్క్‌లు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కష్ట కాలంలో కూడా రైతులు, నిరుపేదలు ఇబ్బందులు పడొద్దని రూ. 30 వేల కోట్లు కేటాయించారంటే వారిపై ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
Tags: minister satyavathi, comments, corona masks, sanitizers, distribution, warangal