వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారణ: సత్యవతి రాథోడ్
దిశ, వరంగల్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా నివారణ సాధ్యమని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మీ కోసం అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా.. ఆమె మహబూబాబాద్‌లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను, ఇంటి ఆవరణలోని ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. వానాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అందరూ […]
దిశ, వరంగల్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా నివారణ సాధ్యమని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మీ కోసం అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా.. ఆమె మహబూబాబాద్‌లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను, ఇంటి ఆవరణలోని ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. వానాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అందరూ విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు తమ నివాసంలో, పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు డ్రై డే నిర్వహించాలని సూచించారు.