ఆర్థిక మాంద్యం ఉన్నా లాక్ డౌన్ తప్పదు: మంత్రి సత్యవతి
దిశ, వరంగల్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నా నెలకు వచ్చే ఆదాయం రాకున్నా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నారని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంత్రి స్వగ్రామం పెద్ద తండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి […]
దిశ, వరంగల్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నా నెలకు వచ్చే ఆదాయం రాకున్నా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నారని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంత్రి స్వగ్రామం పెద్ద తండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని చెప్పారు. కుటుంబాలకు దూరంగా పోలీసులు నిత్యం రోడ్ల మీద ఉంటున్నారని, స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రజలందరూ సహకరిస్తున్నారని, అందుకు ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు.
Tags: satyavathi raothod, economic downturn, lockdown, mahabubabad