ఈ రాశి వారికి బంధువుల నుంచి బహుమానాలు
తేది : 14, ఆగష్టు 2021 ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : శ్రావణమాసం ఋతువు : వర్ష ఋతువు వారము : శనివారం పక్షం : శుక్లపక్షం తిథి : షష్టి (నిన్న మద్యాహ్నం 1 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 50 ని॥ వరకు) నక్షత్రం : చిత్త (నిన్న ఉదయం 8 గం॥ 0 ని॥ […]
తేది : 14, ఆగష్టు 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 42 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 50 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న ఉదయం 8 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 56 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ వరకు)
గుళికకాలం : (ఈ…
మేష రాశి: ఆందోళనలను అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. దైవప్రార్థన వలన పాజిటివ్ ఆలోచనలు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. ఆ ప్రశంసలు మీకు ఎంతో ధైర్యం ఇస్తాయి. వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. మీ తండ్రిగారు నుంచి ధన సహాయం లభిస్తుంది. సరైన ప్రణాళికతో ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతరులతో సామరస్యంగా ప్రవర్తించండి లేకుంటే ఒంటరిగా మిగిలి పోతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన రోజు.
వృషభ రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపారులు లాభాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపడం మీకు ఎంతో ఎనర్జీ. బంధువుల నుంచి బహుమానాలు అందుకుంటారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు.
మిథున రాశి: ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో మీకు ఒప్ప చెప్పబడిన బాధ్యతలలో అజాగ్రత్తగా ఉంటే పై అధికారులతో మాటలు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో పరుషంగా మాట్లాడకండి. మీ మొండితనాన్ని వారి మీద రుద్దకండి. ఆదాయం బాగున్నా అనవసర ఖర్చులు వలన డబ్బు ఇబ్బంది. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి వారు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
కర్కాటక రాశి: మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీకు ఏమి కావాలో మీరు తెలుసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఫలితము ఏదైనా రెడీగా ఉండండి. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఆదాయం పర్వాలేదు దుబారా ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.
సింహరాశి: ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవప్రార్థన వలన మానసిక బలం. కరెక్టు నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటులో తప్పుడు నిర్ణయాలను తీసుకోకండి. ఆఫీస్ పని మీద శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పై అధికారులు గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా మీ పిల్లలతో మీకు ఎంతో ఎనర్జీ. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి మీకు మీరు సొంత వైద్యం చేసుకోకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మానసిక అశాంతి.
కన్యారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక అవసరం కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారితో పరుషంగా మాట్లాడకండి ముఖ్యంగా మీ పెద్ద వారి ఆశీర్వాదాలు తీసుకోండి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత. ప్రతి చిన్న విషయానికి మీ మూడ్ పాడు చేసుకోకండి. దాని వలన ఆరోగ్య సమస్యలు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.
తులారాశి: విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి మరింత కష్టపడండి. విజయం మీదే. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందర ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. మీ ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు ఆనందించండి. ఆదాయం బాగుంది. అనవసరపు ఖర్చులను నివారించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
వృశ్చిక రాశి: ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు.ఆఫీస్ పనులను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి పెండింగ్ పెట్టడం వలన పై అధికారుల నుంచి మాటలు. భాగస్వామ్య వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మందు సిగరెట్టు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. టీవీ మొబైల్ వాడకం వల్ల సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ బాబాయి జీవితంలో ఆనందకరమైన రోజు.
ధనుస్సు రాశి: మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి అదనపు బాధ్యతలు వలన పేరు ప్రఖ్యాతులు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. అనుకోని అతిధి రాక వలన పనులకు ఆటంకం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకోని ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది ఇంతకుముందు పొదుపు చేసిన డబ్బును ఉపయోగిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్టు ఇవ్వబోతున్నారు ఆనందించండి.
మకర రాశి: ఈరోజు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆఫీసులో పనులను పెండింగ్ పెట్టకండి దానివలన మీకు ఇంత వరకు ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరింత పని భారం. వ్యాపారులు మీరు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. ఈ మధ్యనే కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి అనుకోని లాభాలు. కొంతమందికి ఆఫీస్ టూర్. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తి సంక్రమిస్తుంది. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
కుంభరాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు కావలసినంత ధనం చేతికందుతుంది. మీ ఆడంబరాలకు పెట్టే ఖర్చు వలన ఇంట్లో పెద్దవారు మీకు లెక్చర్ ఇస్తారు. కుటుంబ సభ్యులకు నా మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. చాలా రోజుల తర్వాత ఆఫీసులో పని భారం తగ్గుతుంది. కష్ట కాలం లో మిమ్మల్ని ఆదుకున్న బందువులకు కృతజ్ఞతలు చెప్పండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.
మీన రాశి: దైవ సంబంధ కార్యాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత. మీ కోపాన్ని అసహనాన్ని అదుపులో ఉంచుకోండి లేకుంటే చుట్టుపక్కల వారితో మీకు లేనిపోని ఇబ్బందులు. ఆఫీసులో అధిక శ్రమ ఉన్నప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సీజన్ మార్పుల వల్ల దగ్గు జలుబు తలనొప్పి. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అనవసరపు బాతాఖానీల వలన సమయం వృధా. ఆదాయ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.