తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్ర శర్మ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కర్ణాటక తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ […]
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కర్ణాటక తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
In exercise of power conferred under Constitution of India, Hon. President of India, in consultation with Chief Justice of India, is pleased to appoint following Judges as Chief Justices of High Courts along with transfer of following Chief Justices. pic.twitter.com/NRahN3pbKe
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2021