మానవత్వాన్ని చాటుకున్న సర్పంచ్
దిశ, బోధన్: రెంజల్ మండలం సాటపూర్ గ్రామ సర్పంచ్ అకస్మాత్తుగా మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గోసంగి శంకర్(28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ ఏకర్ పాషా, పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ మృతుడి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు. శంకర్ స్థానంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిగా శంకర్ భార్యను విధుల్లోకి […]
దిశ, బోధన్: రెంజల్ మండలం సాటపూర్ గ్రామ సర్పంచ్ అకస్మాత్తుగా మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గోసంగి శంకర్(28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ ఏకర్ పాషా, పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ మృతుడి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు. శంకర్ స్థానంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిగా శంకర్ భార్యను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మృతుడి నలుగురు కూతుళ్ల పేరు మీద ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. సాయిలు, నాయకులు సాయిలు, సురేష్, పోశెట్టి, గంగారాం కూడా మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.