ప్రభుత్వ వాహనంతో సర్పంచ్ వ్యాపారం

దిశ, తుంగతుర్తి: తన సొంత పనుల కోసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‎ను ఉపయోగించుకున్నాడు ఓ ప్రజాప్రతినిధి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వైకుంఠధామం, డంప్ యార్డ్, రైతు వేదికల నిర్మాణం కోసం కావాల్సిన ఇసుకను మండల తహశీల్దార్ పర్మిషన్, వే బిల్‎తో కూడిన పత్రాలను తీసుకుని, ప్రతి ట్రాక్టర్‎కు రెవెన్యూ అధికారులు నియమించి అధికారికంగా తరలిస్తారు. కానీ ఉట్కూర్ గ్రామ సర్పంచ్ […]

Update: 2020-10-07 11:11 GMT

దిశ, తుంగతుర్తి: తన సొంత పనుల కోసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‎ను ఉపయోగించుకున్నాడు ఓ ప్రజాప్రతినిధి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. వైకుంఠధామం, డంప్ యార్డ్, రైతు వేదికల నిర్మాణం కోసం కావాల్సిన ఇసుకను మండల తహశీల్దార్ పర్మిషన్, వే బిల్‎తో కూడిన పత్రాలను తీసుకుని, ప్రతి ట్రాక్టర్‎కు రెవెన్యూ అధికారులు నియమించి అధికారికంగా తరలిస్తారు. కానీ ఉట్కూర్ గ్రామ సర్పంచ్ తహశీల్దార్ నుంచి ఎలాంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా, అక్రమంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్‎లో తరలించినట్లు సమాచారం. మరోవైపు గ్రామపంచాయతీ ట్రాక్టర్‎ను మైనర్ పిల్లలకు అప్పజెప్పి వారితో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్‎లో నింపి గ్రామానికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో హాల్‎చల్ చేస్తోంది. దీనిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Tags:    

Similar News