ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరిస్తా

దిశ, శంకర్‌పల్లి: గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ స్వప్న మోహన్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీసీరోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ సమస్యలు గురించి ఎక్కువగా సమావేశం దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా ఆ సమస్యల […]

Update: 2021-10-08 09:37 GMT

దిశ, శంకర్‌పల్లి: గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ స్వప్న మోహన్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీసీరోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ సమస్యలు గురించి ఎక్కువగా సమావేశం దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ స్వర్ణలత, ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, కార్యదర్శి హరికృష్ణ, వార్డు మెంబర్లు ఇందిరమ్మ, సుమిత్ర, మల్లేష్, రేణుకా, నవీన్, భాస్కర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News