నిధులు మింగేసిన సర్పంచ్ సస్పెన్షన్

దిశ, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన గుండెంగ సర్పంచ్ భూక్య రవిసింగ్‌ను సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్ సస్పెండ్ చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేయడం భరించరాని నేరంగా పరిగణిస్తామని చెప్పారు.ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(11) కిందట ఆయనపై వచ్చిన ఆరోపణల మేరకు సమగ్ర విచారణ జరిపించాకే సర్పంచ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇకపై పంచాయతీ పూర్తి బాధ్యతలను ఉపసర్పంచ్ […]

Update: 2020-07-27 11:18 GMT

దిశ, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన గుండెంగ సర్పంచ్ భూక్య రవిసింగ్‌ను సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్ సస్పెండ్ చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేయడం భరించరాని నేరంగా పరిగణిస్తామని చెప్పారు.ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(11) కిందట ఆయనపై వచ్చిన ఆరోపణల మేరకు సమగ్ర విచారణ జరిపించాకే సర్పంచ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇకపై పంచాయతీ పూర్తి బాధ్యతలను ఉపసర్పంచ్ కందిక స్వామికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News