సర్కార్ కీలక నిర్ణయం.. పోస్టుమార్టం ఈ వేళల్లో కూడా చేయవచ్చు
దిశ, తెలంగాణ బ్యూరో : రాత్రి వేళల్లోను పోస్టు మార్టమ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ విధానాన్ని అమలు చేసేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని డీఎంఈ డా రమేష్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 6 తర్వాత కూడా పోస్టు మార్టమ్ చేయాలని ఆయా సూపరింటెండెంట్లను ఆదేశించారు. అంతేగాక రాత్రి సమయంలో చేసే ప్రతీ పోస్టు మార్టమ్ విధానాన్ని తప్పనిసరిగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాత్రి వేళల్లోను పోస్టు మార్టమ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ విధానాన్ని అమలు చేసేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని డీఎంఈ డా రమేష్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 6 తర్వాత కూడా పోస్టు మార్టమ్ చేయాలని ఆయా సూపరింటెండెంట్లను ఆదేశించారు. అంతేగాక రాత్రి సమయంలో చేసే ప్రతీ పోస్టు మార్టమ్ విధానాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలని సూచించారు. రికార్డులలో సేఫ్‌గా భద్రపరచాలన్నారు. అయితే మెడికో లీగల్ కేసులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట పోస్ట్‌మార్టమ్ నిర్వహించవద్దని సూచించారు.
సౌకర్యాలు నిల్..
సాయంత్రం 6 తర్వాత కూడా పోస్టు మార్టమ్చేయాలని సర్కార్ సూచించినా, దానికి అనుగుణంగా స్టాఫ్లేరని ఆసుపత్రి అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో పాటు సరైన మౌలిక వసతులు కూడా లేవని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి గాంధీ మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరే ఆసుపత్రిలోనూ పోస్ట్ మార్టమ్ కొరకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో ప్రతీ రోజు ఎంతో మంది మృతదేహాల కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. సిబ్బంది, మౌలిక సౌకర్యాలు కొరతతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. వాస్తవానికి గాంధీ ఆసుపత్రిలో ప్రతీ ఏడాది సగటున 7 వేల వరకు పోస్టు మార్టమ్లు జరుగుతాయి. ఇక్కడ ప్రస్తుతం ఫోరెనిక్స్ విభాగానికి చెందిన ఇద్దరు ప్రోఫెసర్లు, 2 అసోసియేట్లు, 5 అసిస్టెంట్లు, నలుగురు పీజీలు పనిచేస్తున్నారు. కానీ డ్యూటీలకు మాత్రం కేవలం ఒక ప్రోఫెసర్ మాత్రమే హజరవుతున్నారని సమాచారం. దీంతో మరో ప్రోఫెసర్‌తో పాటు సిబ్బందిపై పనిభారం పడుతున్నదని చెబుతున్నారు. ఉస్మానియాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రాత్రివేళ్లలో పోస్టు మార్టమ్ నిర్వహించేందుకు సరైన లైటింగ్ లేదు. దీంతో పాటు కోల్ట్ స్టోరేజ్‌లు, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది సమస్యఉన్నది. అంతేగాక పవర్ జనరేటర్లు కూడా అవసరం. కావున వీటన్నింటిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయా ఆసుపత్రుల అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.