మేడారంలో మరో విషాదం.. వారం వ్యవధిలోనే సమక్క, సారలమ్మల ప్రధాన పూజరులు మృతి

దక్షిణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం‌లో మరో తీవ్ర విషాదం నెలకొంది. వారం రోజుల క్రితమే ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక ప్రధాన పూజారి ముత్తయ్య మృతి

Update: 2024-07-26 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం‌లో మరో తీవ్ర విషాదం నెలకొంది. వారం రోజుల క్రితమే ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక ప్రధాన పూజారి ముత్తయ్య మృతి చెందగా.. తాజాగా సారలమ్మ ప్రధాన పూజారి సంపత్ కన్ను మూశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. సమ్మక్క, సారలమ్మల ప్రధాన పూజారుల వరుస మరణాలు భక్తులను కలవరపెడుతున్నాయి. పూజారి సంపత్ మరణవార్త తెలుసుకున్న మంత్రి సీతక్క వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More..

Accident : బీభత్సం సృష్టించిన కారు… ఒకరు మృతి 


Similar News