మరోసారి శరద్ పవార్, ప్రశాంత్ కిశోర్ భేటీ
న్యూఢిల్లీ: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌లు మరోసారి భేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఇది వీరి మూడో సమావేశం. పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశం ఒక గంటపాటు సాగింది. వీరివురు రెండు సార్లు భేటీ కావడంతోనే దేశంలో థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు పడుతున్నాయని చర్చ తీవ్రమైంది. పీకేతో రెండో భేటీ ముగిసిన తర్వాతే 8 పార్టీల విపక్ష నేతలు భేటీ కావాలని ఆహ్వానం వెళ్లడంతో థర్డ్ ఫ్రంట్ […]
న్యూఢిల్లీ: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌లు మరోసారి భేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఇది వీరి మూడో సమావేశం. పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశం ఒక గంటపాటు సాగింది. వీరివురు రెండు సార్లు భేటీ కావడంతోనే దేశంలో థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు పడుతున్నాయని చర్చ తీవ్రమైంది. పీకేతో రెండో భేటీ ముగిసిన తర్వాతే 8 పార్టీల విపక్ష నేతలు భేటీ కావాలని ఆహ్వానం వెళ్లడంతో థర్డ్ ఫ్రంట్ ఇక ఖాయమేనన్న వాదనలు వచ్చాయి.
కానీ, మంగళవారం వీరి భేటీ తర్వాత ఇది రాజకీయ సమావేశం కాదని, కేవలం దేశంలోని ప్రస్తుత పరిణామాలపై మాట్లాడామని నేతలు తెలియజేశారు. థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ కూటములు బీజేపీకి సమర్థమైన సవాల్‌ను విసరలేవని పీకే అభిప్రాయపడటం గమనార్హం.