తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేషన్‌కార్డు దారుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారా? లబ్దిదారులందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు సుముఖతతో ఉన్నారా ! అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 85లక్షల 54వేల మందికి రేషన్‌కార్డులు ఉండగా వారిందరికీ ఇప్పటివరకు దొడ్డుబియ్యం మాత్రే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలందరూ ఈ బియ్యాన్నే తింటున్నారు. కానీ కొందరు ఈ బియ్యం పట్ల మక్కువ చూపకుండా బయట వ్యాపారులకు అమ్మి వచ్చి పైసలతో […]

Update: 2020-10-06 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేషన్‌కార్డు దారుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారా? లబ్దిదారులందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు సుముఖతతో ఉన్నారా ! అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 85లక్షల 54వేల మందికి రేషన్‌కార్డులు ఉండగా వారిందరికీ ఇప్పటివరకు దొడ్డుబియ్యం మాత్రే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలందరూ ఈ బియ్యాన్నే తింటున్నారు. కానీ కొందరు ఈ బియ్యం పట్ల మక్కువ చూపకుండా బయట వ్యాపారులకు అమ్మి వచ్చి పైసలతో మళ్లీ సన్నబియ్యం కొనుక్కొని తింటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై ఇవాళో, రేపో సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Tags:    

Similar News