‘ఏ బౌలర్‌నైనా ఎదుర్కొగలిగే ధైర్యం ఉంది’
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో క్రీడాభిమానులకు కావాల్సిన మజా దొరుకుతోంది. క్షణం క్షణం ఉత్కంఠను రేపుతూ, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతంగా రాణించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. భారీ షాట్లతో బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ మ్యాచ్ అనంతరం సంజూ మీడియాతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో క్రీడాభిమానులకు కావాల్సిన మజా దొరుకుతోంది. క్షణం క్షణం ఉత్కంఠను రేపుతూ, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతంగా రాణించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. భారీ షాట్లతో బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ మ్యాచ్ అనంతరం సంజూ మీడియాతో మాట్లాడుతూ…
‘గత ఏడాదిగా ఫామ్‌లో ఉండటం కలసి వచ్చింది. అందుకే ఎలాంటి బౌలర్‌ను అయినా ఎదుర్కోగలననే ధైర్యం ఉంది. గత మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాను. నా కెరీర్ మరో 10 ఏళ్లు కొనసాగుతుందనే నమ్మకం నాకుంది.’ అని శాంసన్ స్పష్టం చేశారు.