నా పనితీరు నచ్చలేదేమో: మంజ్రేకర్

బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిన తరువాత సంజయ్ మంజ్రేకర్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘నేను కామెంట్రీని ఎప్పుడూ గొప్ప హక్కుగా భావించాను. కాని అది నా అర్హత అనుకోలేదు. నేను కామెంటేటర్‌గా ఉండాలా వద్దా అనేది యజమాని అయినా బీసీసీఐ ఇష్టం. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నా పనితీరు పట్ల బీసీసీఐ వర్గాలు సంతృప్తి చెందలేదనుకుంటా. ప్రొఫెషనల్ కామెంటేటర్‌గా దీన్నినేను అంగీకరిస్తున్నాను’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. […]

Update: 2020-03-15 11:01 GMT

బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిన తరువాత సంజయ్ మంజ్రేకర్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘నేను కామెంట్రీని ఎప్పుడూ గొప్ప హక్కుగా భావించాను. కాని అది నా అర్హత అనుకోలేదు. నేను కామెంటేటర్‌గా ఉండాలా వద్దా అనేది యజమాని అయినా బీసీసీఐ ఇష్టం. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నా పనితీరు పట్ల బీసీసీఐ వర్గాలు సంతృప్తి చెందలేదనుకుంటా. ప్రొఫెషనల్ కామెంటేటర్‌గా దీన్నినేను అంగీకరిస్తున్నాను’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. కాగా, ధర్మశాల వేదికగా భారత్ – దక్షణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ఈ మ్యాచ్‌కు కామెంట్రీ ప్యానెల్ సభ్యుడైన మంజ్రేకర్ హాజరు కాలేదు. ఇటీవల రవీంద్ర జడేజా పై విమర్శలు చేయడంతో అతన్ని కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించింది బీసీసీఐ.

tag; sanjay manjrekar, commentator, bcci, sports news, cricket

Tags:    

Similar News