వైద్యం కోసం న్యూయార్క్‌కు సంజు..

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉండగా.. అనారోగ్య కారణాల వల్ల షూటింగ్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే సంజూ భాయ్ విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటారని వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే సంజయ్ వైద్యం చేయించుకునేందుకు ఐదేళ్ల అమెరికా వీసా పొందారని సమాచారం. సతీమణి మాన్యతా దత్, సోదరి ప్రియా దత్‌తో కలిసి ట్రీట్‌మెంట్ కోసం త్వరలో న్యూయార్క్ […]

Update: 2020-08-25 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉండగా.. అనారోగ్య కారణాల వల్ల షూటింగ్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే సంజూ భాయ్ విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటారని వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే సంజయ్ వైద్యం చేయించుకునేందుకు ఐదేళ్ల అమెరికా వీసా పొందారని సమాచారం. సతీమణి మాన్యతా దత్, సోదరి ప్రియా దత్‌తో కలిసి ట్రీట్‌మెంట్ కోసం త్వరలో న్యూయార్క్ వెళ్ళనున్నాడని సమాచారం.

ఈ విషయం తెలిసిన అభిమానులు.. సంజూ భాయ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక సంజూ నటిస్తున్న మరికొన్ని ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. తను న్యూయార్క్ నుంచి తిరిగొచ్చాకే ఆ సినిమాలు పూర్తిచేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News