'సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెట్టాలో అర్థం కావడం లేదు'

దిశ, స్పోర్ట్స్: మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన బలహీనత గురించి బయట పెట్టాడు. తనకు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎలా పోస్టులు పెట్టాలో తెలియదని అంటున్నారు. తాను మంచి కోరి పెట్టే పోస్టులు కూడా తనకు రివర్స్ అయ్యాయని వాపోయాడు. ఇప్పటికీ అందరూ ఇష్టపడేలా ట్విట్టర్ పోస్టులు పెట్టడం తనకు రావడం లేదని అన్నాడు. క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ మంజ్రేకర్.. సోషల్ మీడియాలో మాత్రం తన […]

Update: 2021-06-19 09:44 GMT

దిశ, స్పోర్ట్స్: మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన బలహీనత గురించి బయట పెట్టాడు. తనకు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎలా పోస్టులు పెట్టాలో తెలియదని అంటున్నారు. తాను మంచి కోరి పెట్టే పోస్టులు కూడా తనకు రివర్స్ అయ్యాయని వాపోయాడు. ఇప్పటికీ అందరూ ఇష్టపడేలా ట్విట్టర్ పోస్టులు పెట్టడం తనకు రావడం లేదని అన్నాడు. క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ మంజ్రేకర్.. సోషల్ మీడియాలో మాత్రం తన పోస్టులతో ఎదుటి వారిని కించపరిచేలా వ్యవహరించాడు.

గతంలో రవీంద్ర జడేజాను, తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేస్తూ ట్వీట్లు పెట్టాడు. దీనిపై చాలా దుమారం చెలరేగింది. గతంతో ఇలా చేసినందుకే బీసీసీఐ అతడిని కామెంటేటర్‌గా తప్పించింది. తాను ట్విట్టర్‌లో సలహాలు చెబుతామని రాస్తుంటాను. కానీ నాకు ఎక్కువ సార్లు చెడే జరిగింది. నిజంగా సోషల్ మీడియా ఒక మృగంలా ఉన్నది. దాన్ని అర్దం చేసుకోలేక పోతున్నాను అని మంజ్రేకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News