గంధపు చెక్కలతో దేశం దాటబోయి..

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్స్ ఎందరో ఉన్నారు. కస్టమ్స్ అధికారులు కూడా బంగారం తరలింపులపై ఎక్కువగా నిఘా వేస్తూ ఉంటారు. విమానాల ద్వారా సాగే వజ్రాల అక్రమాల తరలింపులకు అడ్డుకట్ట వేస్తుంటారు. కానీ, అడవుల్లో లభించే గంధపు దుంగలు, చెక్కలను ఎక్కువగా ఫారెస్ట్ అధికారులు సీజ్ చేస్తుంటారు. ఇది ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ, ఓ ప్రయాణికుడు గంధపు చెక్కలతో దేశం దాటబోయి ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు. […]

Update: 2020-07-30 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్స్ ఎందరో ఉన్నారు. కస్టమ్స్ అధికారులు కూడా బంగారం తరలింపులపై ఎక్కువగా నిఘా వేస్తూ ఉంటారు. విమానాల ద్వారా సాగే వజ్రాల అక్రమాల తరలింపులకు అడ్డుకట్ట వేస్తుంటారు. కానీ, అడవుల్లో లభించే గంధపు దుంగలు, చెక్కలను ఎక్కువగా ఫారెస్ట్ అధికారులు సీజ్ చేస్తుంటారు. ఇది ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ, ఓ ప్రయాణికుడు గంధపు చెక్కలతో దేశం దాటబోయి ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు.

సూడాన్ దేశానికి చెందిన ఓ ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి మస్కట్ మీదుగా ఖార్టూమ్ వెళ్తున్నాడు. గురువారం టికెట్ బుక్ చేసుకున్న అతడు ఓ పెద్ద బ్యాగుతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం కలిగిన కస్టమ్ అధికారులు బ్యాగ్‌ను తనిఖీ చేశారు. సుమారు క్వింటాకు పైగా బరువు ఉండడంతో అనుమానం వచ్చి అఫీషియల్ స్కానింగ్ చేయగా.. బ్యాగులో నుంచి 114.25 కిలోల గంధపు చెక్కలు బయటపడ్డాయి. దీంతో గంధపు చెక్కలను సీజ్ చేసిన అధికారులు.. స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News