సమంత షాకింగ్ డెసిషన్.. ఇక వాటికి గుడ్ బై చెప్పనుందా ?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో సమంత ఒక్కరు. అయితే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంత పై నెటిజన్లు ఎన్నో ట్రోల్స్ చేశారు. కొంత మంది సమంతకు అండగా నిలిస్తే మరికొందరు చైతన్య, సామ్ విడాకులు తీసుకోవడానికి సామ్ కారణం అంటూ సామ్‌పై ఫైర్ అయ్యారు. కానీ విడాకుల బాధలో ఉన్న సామ్ ఆ సమయంలో ఈ ట్రోల్స్ పై ఎక్కువగా స్పందిచలేదు. తీర్థయాత్రలు […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో సమంత ఒక్కరు. అయితే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంత పై నెటిజన్లు ఎన్నో ట్రోల్స్ చేశారు. కొంత మంది సమంతకు అండగా నిలిస్తే మరికొందరు చైతన్య, సామ్ విడాకులు తీసుకోవడానికి సామ్ కారణం అంటూ సామ్‌పై ఫైర్ అయ్యారు. కానీ విడాకుల బాధలో ఉన్న సామ్ ఆ సమయంలో ఈ ట్రోల్స్ పై ఎక్కువగా స్పందిచలేదు. తీర్థయాత్రలు చేస్తూ.. స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తున్న సామ్ ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో సామ్ అప్పడప్పుడు నెటిజన్లకు ఇన్ డైరెక్ట్కగా చురకలంటిస్తూనే ఉంది. అయినా రూమర్స్ ఆగకపోవడం, ట్రోల్స్ చేస్తూ ఉండటంతో.. నెటిజన్ల ఆగడాలు తట్టుకోలేని సామ్ కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తోందనే గుస గుసలు వినిపిస్తున్నాయి.
వాహనదారులకు బంపర్ ఆఫర్.. హెల్మెట్ కొంటే లక్ష మీ సొంతం
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ తొందర్లో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందని టాక్. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో సామ్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. విడాకుల విషయం దగ్గరనుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నారని సమాచారం. అవతలి వాళ్ల ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా నెటిజన్లు పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుందని, అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండడం వలన అయినా ప్రశాంతంగా ఉండగలుగుతానేమో అని సామ్ భావిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంత నిజంగానే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందా ? తన అభిమానులతో ప్రతీది పంచుకునే సామ్ నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందా అంటే.. ఏమో మరీ ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సింది. ఇది పుకారా లేక నిజమేనా అనేది అప్పుడే తేలిపోతుంది.