సామ్… నీ మాట నా హృదయాన్ని తాకిందంటున్న స్టార్ హీరో
దిశ, సినిమా: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఈ నెల 17న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా’తో అభిమానులను ఉర్రూతలూగించిన సమంత.. ఈ సినిమాలో బన్నీ నటనపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసిన సామ్.. ‘పుష్పలో బన్నీ ప్రతీ క్షణం అందరినీ కట్టిపడేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక నటుడు అసాధారణ స్థాయిలో పర్ఫార్మ్ […]
దిశ, సినిమా: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఈ నెల 17న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా’తో అభిమానులను ఉర్రూతలూగించిన సమంత.. ఈ సినిమాలో బన్నీ నటనపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసిన సామ్.. ‘పుష్పలో బన్నీ ప్రతీ క్షణం అందరినీ కట్టిపడేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక నటుడు అసాధారణ స్థాయిలో పర్ఫార్మ్ చేస్తే అలాంటి వారి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం. ఎంతో మందికి స్ఫూర్తి దాయకం’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘మీ హృదయపూర్వక అభినందనలకు ధన్యవాదాలు. మీ పొగడ్త నా గుండెను తాకింది’ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.