‘మామ’ అంటూ మ్యాటర్ క్లోజ్ చేసిన సమంత

దిశ, సినిమా : నేడు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేని నాగార్జునకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన కోడలు, నాగచైతన్య వైఫ్ సమంత హార్ట్‌ఫెల్ట్ బర్త్‌డే నోట్ రాసుకొచ్చింది. ‘మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అద్భుతానికి నిలువుటద్దంలా ఉండే నాగార్జున మామకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఎమోజీస్ యాడ్ చేసింది. ఇక సమంత లేటెస్ట్ […]

Update: 2021-08-29 06:16 GMT

దిశ, సినిమా : నేడు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేని నాగార్జునకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన కోడలు, నాగచైతన్య వైఫ్ సమంత హార్ట్‌ఫెల్ట్ బర్త్‌డే నోట్ రాసుకొచ్చింది. ‘మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అద్భుతానికి నిలువుటద్దంలా ఉండే నాగార్జున మామకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఎమోజీస్ యాడ్ చేసింది. ఇక సమంత లేటెస్ట్ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మధ్యే ట్విట్టర్ అకౌంట్‌లోని తన ప్రొఫైల్ పేరు నుంచి ‘అక్కినేని’ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను గమనిస్తున్న నెటిజన్లు.. నాగ్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని, సమంత-నాగచైతన్య విడిపోతున్నారనే రూమర్స్ స్ర్పెడ్ చేస్తున్నారు. వీటిని సమంత కూడా ఖండించకపోవడంతో ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడిపోయారు.

కానీ మామ నాగార్జున బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ నోట్ షేర్ చేయడంతో ఆ రూమర్స్ అన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. సామ్‌పై నెగెటివ్ వార్తల పట్ల ఇన్నాళ్లూ బాధపడ్డ ఫ్యాన్స్.. ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. సరైన సమయం కోసం ఇప్పటిదాకా వేచిచూసిన సామ్.. ఒక్క ట్వీట్‌తో విమర్శకుల నోళ్లు మూయించిందని సంబరపడుతున్నారు.

Tags:    

Similar News