ఆర్టీసీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్.. రాష్ట్రమంతా చేసేందుకు సజ్జనార్ నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో గాయపడి రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో గాయపడి రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
#TSRTC in association with @IndianRedCross & @praharitrust organizing #MegaBlooddonationCamp across #Telangana State in 65 locations. Citizens are requested to come forward & #DonatebloodSaveLives #IchooseTSRTC #fridaymorning #BlackFriday2021 #Thanksgiving2021 #ThanksgivingDay pic.twitter.com/vKICLHA4nZ
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 26, 2021