దటీజ్ సజ్జనార్.. ఆర్టీసీలో మరో కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రజారవాణాను గాడీలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను ఎండీగా నియమించారు. అంతేకాకుండా సంస్థకి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను చైర్మన్‌గా నియమించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకునేలా దిశానిర్దేశం చేశారు. అయితే, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చారు. దీంతో కార్మికుల్లో […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రజారవాణాను గాడీలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను ఎండీగా నియమించారు. అంతేకాకుండా సంస్థకి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను చైర్మన్‌గా నియమించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకునేలా దిశానిర్దేశం చేశారు. అయితే, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చారు. దీంతో కార్మికుల్లో మరింత ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కార్మికులకు ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే అసాధారణ సెలవులను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల గాని మరేదైనా వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకోవచ్చు. అంతేకాకుండా రిటైర్మెంట్‌కు దగ్గరున్నవారు కూడా.. ఐదేళ్ల వరకు ఈ సెలవు తీసుకొనే అవకాశం ఉంది. సెలవు పూర్తయిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సమయంలో జీతం చెల్లించరు. కానీ ఉద్యోగం ఉంటుంది.