కొడాలి వ్యాఖ్యలను తప్పుబట్టిన సజ్జల
దిశ, వెబ్ డెస్క్: హిందూ దేవాలయాలపై, ప్రధాని మోడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై తీవ్ర రగడ నడుస్తోంది. ప్రధాని మోడీని సతీసమేతంగా తిరుమలకు రమ్మనండి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ వెనకుండి మంత్రులతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొడాలి నాని చేసిన […]
దిశ, వెబ్ డెస్క్: హిందూ దేవాలయాలపై, ప్రధాని మోడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై తీవ్ర రగడ నడుస్తోంది. ప్రధాని మోడీని సతీసమేతంగా తిరుమలకు రమ్మనండి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్ వెనకుండి మంత్రులతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన… అవి ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు తప్పని కొడాలి నానికి కూడా అర్ధమై ఉండొచ్చన్నారు.
జగన్ టార్గెట్ గా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నం జరుగుతోందని సజ్జల ఆరోపించారు. దేవాలయాలపై దాడి కుట్రపూరితమేనన్న ఆయన.. బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ప్రజా సమస్యలపై ధర్నా చేసుంటే బాగుండేదని హితవు పలికారు. ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది కనుకే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు.
జగన్ భక్తిశ్రద్ధలతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎంతరెచ్చగొట్టినా జగన్ చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఒక వ్యవస్థకంటే మరో వ్యవస్థను కించపరచడం సరైంది కాదని సూచించారు. కాబట్టి విపక్షాలు కుట్రలు మానుకుని ప్రజలకు మేలు జరిగే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.