సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. వారికి భారీగా ఫైన్

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఇసుక ఉండటంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండడమే ప్రమాదానికి కారణమని, అందువల్లే బైక్ స్కిడ్ అయ్యి తేజు కిందపడ్డారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని సినీ ప్రముఖులు, ప్రజలు కూడా లేవనెత్తడంతో జీహెచ్ఎంసీ […]

Update: 2021-09-14 00:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఇసుక ఉండటంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండడమే ప్రమాదానికి కారణమని, అందువల్లే బైక్ స్కిడ్ అయ్యి తేజు కిందపడ్డారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని సినీ ప్రముఖులు, ప్రజలు కూడా లేవనెత్తడంతో జీహెచ్ఎంసీ చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది.

రోడ్డుపై ఇసుక ఉండటానికి కారణమైన అరబిందో కన్స్ట్రక్షన్స్ కంపెనీకి భారీ మొత్తంలో జరిమానా విధించింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లోని 674 సెక్షన్ ప్రకారం రూ.1 లక్ష జరిమానా విధించారు. అయితే దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ నగరంలో రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది, సంబంధిత కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News