మీ సాయం వద్దు.. హోం మంత్రికి, సత్యవతి రాథో‌డ్‌కు షాకిచ్చిన సైదాబాద్ బాలిక పేరెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌‌లు వారి ఇంటికి చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి రూ.20 లక్షల చెక్కును అందించారు. అంతేకాకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కానీ, మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ.20 […]

Update: 2021-09-15 23:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌‌లు వారి ఇంటికి చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి రూ.20 లక్షల చెక్కును అందించారు.

అంతేకాకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కానీ, మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు అవసరం లేదని, నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News