సింగపూర్ ఓపెన్ నుంచి వైదొలగిన భారత షట్లర్లు

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు బి సాయి ప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్వని పొన్నప్ప జూన్ 1 నుంచి 5 వరకు జరుగనున్న సింగపూర్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. సింగపూర్ ఓపెన్‌లోపాల్గొనాలంటే 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటే ప్రాక్టీస్‌కు వీలుండదని.. అలా అన్ని రోజులు ప్రాక్టీస్ లేకుండా ఆడటం సాధ్యం కాకపోవడంతోనే టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. మహిళల డబుల్స్ ప్లేయర్లు పొన్నప్ప-సిక్కిరెడ్డి, […]

Update: 2021-05-11 11:22 GMT

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు బి సాయి ప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్వని పొన్నప్ప జూన్ 1 నుంచి 5 వరకు జరుగనున్న సింగపూర్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. సింగపూర్ ఓపెన్‌లోపాల్గొనాలంటే 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటే ప్రాక్టీస్‌కు వీలుండదని.. అలా అన్ని రోజులు ప్రాక్టీస్ లేకుండా ఆడటం సాధ్యం కాకపోవడంతోనే టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు.

మహిళల డబుల్స్ ప్లేయర్లు పొన్నప్ప-సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్ ప్లేయర్లు సాత్వీక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా సింగపూర్ వెళ్లడం లేదని చెప్పారు. దీంతో డబుల్స్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించే వీలు లేకుండా పోయింది. కాగా, సాయి ప్రణీత్ మాత్రం ఇండియాలోనే ఉండి ఒలింపిక్స్‌ కోసం సిద్దపడనున్నట్లు తెలిపాడు. తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన కారణంగా కొన్ని రోజులు ప్రాక్టీస్‌కు విరామం ఇస్తున్నట్లు తెలిపాడు.

Tags:    

Similar News