తేజ్ స్లోగన్ – సోలో బతుకే సో బెటర్
ప్రేమికుల రోజును బ్యాన్ చేసేందుకు నడుం కట్టాడు మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. సోలో బతుకే సో బెటర్.. స్లోగన్‌తో సింగిల్స్‌కు సపోర్ట్ చేస్తున్నారు. సోలో బతుకే సో బెటర్ పుస్తకాన్నే రాసేసిన తేజ్…. కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. కాలం, కారణాలతోపాటు మారే ఫీలింగ్స్. ప్రేమ కూడా అలాంటిదే. మారదని గ్యారంటీ ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాడు. సోలో బతుకే సో బెటర్.. సినిమాలో ఓ […]
ప్రేమికుల రోజును బ్యాన్ చేసేందుకు నడుం కట్టాడు మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. సోలో బతుకే సో బెటర్.. స్లోగన్‌తో సింగిల్స్‌కు సపోర్ట్ చేస్తున్నారు. సోలో బతుకే సో బెటర్ పుస్తకాన్నే రాసేసిన తేజ్…. కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. కాలం, కారణాలతోపాటు మారే ఫీలింగ్స్. ప్రేమ కూడా అలాంటిదే. మారదని గ్యారంటీ ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాడు. సోలో బతుకే సో బెటర్.. సినిమాలో ఓ ఫ్యాన్ క్లబ్‌ను కూడా తయారు చేసుకున్న తేజ్. మన గోల్-కోపం… ఎజెండా-ఫ్రీడం… స్లోగన్-సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు.
వాలెంటైన్స్ డే సందర్భంగా సోలో బతుకే సో బెటర్ థీమ్‌ను విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. దీనిపై సింగిల్స్ తెగ లైక్ కొట్టేస్తున్నారు. సింగిల్‌గా ఉంటేనే ఫ్రీడం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింగిల్ థీమ్ వీడియోలో ఏపీ జె అబ్దుల్ కలాం, వాజ్ పేయి, మదర్ థెరిసా, లతా మంగేష్కర్‌లతోపాటు ఆర్. నారాయణ మూర్తి ఫొటోను కూడా హైలెట్ చేయడంపై మూవీ యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు అభిమానులు. SVCC బ్యానర్‌లో వస్తున్న సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత కాగా సుబ్బు డైరెక్టర్. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి థమన్ అందిస్తున్న మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది.