పోలీసుల త్యాగాలను గౌరవిద్దాం : తేజ్

దిశ, వెబ్‌డెస్క్: మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తన వంతు సహాయాన్ని ఇప్పటికే అందించారు. తెలుగు, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి మొత్తం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులు, మీడియాకు అభినందనలు తెలిపిన తేజ్…. వారి సేవలకు సలాం చేస్తూ మనం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు బయట విధులు నిర్వహిస్తూ .. […]

Update: 2020-03-28 00:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తన వంతు సహాయాన్ని ఇప్పటికే అందించారు. తెలుగు, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి మొత్తం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులు, మీడియాకు అభినందనలు తెలిపిన తేజ్…. వారి సేవలకు సలాం చేస్తూ మనం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

పోలీసులు బయట విధులు నిర్వహిస్తూ .. ఇంట్లోకి వచ్చినా భార్యాపిల్లలతో దూరంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని… మనం ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. వారు చేస్తున్న త్యాగం ముందు… మనం ఇంట్లో సురక్షితంగా ఉండడం లెక్కేమీ కాదని అభిప్రాయపడ్డారు తేజ్. లాక్ డౌన్ గడువు ముగిసే వరకు దయచేసి ఇంట్లోనే ఉంటూ… వారి త్యాగాలను గౌరవిద్దామని పిలుపునిచ్చారు.


Tags: Sai Dharam Tej, CoronaVirus, Covid19

Tags:    

Similar News