రైతు పంటపొలంలోకి మురికి…

దిశ, చిట్యాల: తమ పంట పొలంలోకి గ్రామంలోని మురికి నీటిని సర్పంచు కాలువ తీసి వదిలి వేస్తున్నారని రైతు ఇండ్ల రాజమల్లు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొంటూ రైతు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(టీ) 21/బీ,32/ఏ/అ,32/బీ/2 గల సర్వేనెంబర్ లో 39 గుంటల వ్యవసాయ భూమి ఉందన్నారు. గత కొంతకాలంగా స్థానిక సర్పంచ్ మురుగు […]

Update: 2021-06-15 07:27 GMT

దిశ, చిట్యాల: తమ పంట పొలంలోకి గ్రామంలోని మురికి నీటిని సర్పంచు కాలువ తీసి వదిలి వేస్తున్నారని రైతు ఇండ్ల రాజమల్లు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొంటూ రైతు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(టీ) 21/బీ,32/ఏ/అ,32/బీ/2 గల సర్వేనెంబర్ లో 39 గుంటల వ్యవసాయ భూమి ఉందన్నారు.

గత కొంతకాలంగా స్థానిక సర్పంచ్ మురుగు నీటిని కాల్వ తీసి తమ పొలంలోకి వదులుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీటి వలన చెత్తాచెదారంతో పాటు పగిలిన ఖాళీ సీసాలు రావడం వల్ల పొలంలో పనికి కూలీలు రావడం లేదన్నారు. వీటి వల్ల పంట నష్టం జరుగుతుందన్నారు. అధికారులకు సమస్యపై పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags:    

Similar News