నేడే సద్దుల బతుకమ్మ
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. మహాలయ అమావాస్యతో ప్రారంభమై తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ.. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలతో పూర్తవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు పండగ కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విజయదశమి కంటే సద్దుల బతుకమ్మకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు మనసారా గౌరమ్మను ఆరాధిస్తారు. […]
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. మహాలయ అమావాస్యతో ప్రారంభమై తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ.. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలతో పూర్తవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు పండగ కళను సంతరించుకున్నాయి.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విజయదశమి కంటే సద్దుల బతుకమ్మకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు మనసారా గౌరమ్మను ఆరాధిస్తారు. మన సంస్కృతి ఉట్టిపడేలా పాటలు పాడుతూ సందడిగా మారనున్నాయి. బతుకమ్మ వేడుకలు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మతో ఈ ఎనిమిది రోజులు వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.