నా కెరీర్‌లో అవి కలగానే మిగిలాయి : సచిన్ టెండుల్కర్

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ ఒక మతమైతే సచిన్ దేవుడు అంటూ ఎంతో మంది అభిమానులు వ్యాఖ్యానిస్తుంటారు. తన పాతికేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 100 సెంచరీలతో పాటు 34 వేలకు పైగా పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాంటి సచిన్ కెరీర్‌లో రెండు విషయాలు మాత్రం తీరని కలగానే మిగిలిపోయానని చెప్పాడు. ‘క్రికెట్‌లోనాకు చిన్నప్పటి నుంచి సునీల్ గవాస్కర్ ఒక రోల్ మోడల్. ఆయనతో కలసి నేను క్రికెట్ ఆడలేకపోయాను. గవాస్కర్ రిటైర్ […]

Update: 2021-05-30 10:42 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ ఒక మతమైతే సచిన్ దేవుడు అంటూ ఎంతో మంది అభిమానులు వ్యాఖ్యానిస్తుంటారు. తన పాతికేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 100 సెంచరీలతో పాటు 34 వేలకు పైగా పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాంటి సచిన్ కెరీర్‌లో రెండు విషయాలు మాత్రం తీరని కలగానే మిగిలిపోయానని చెప్పాడు. ‘క్రికెట్‌లోనాకు చిన్నప్పటి నుంచి సునీల్ గవాస్కర్ ఒక రోల్ మోడల్. ఆయనతో కలసి నేను క్రికెట్ ఆడలేకపోయాను. గవాస్కర్ రిటైర్ అయిన రెండేళ్ల తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడంతో నాకు ఆ అవకాశం రాలేదు. ఇక వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్‌తో కౌంటీ క్రికెట్ ఆడాను. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. నా కెరీర్‌లో తీరని కలలు ఇవే’ అని సచిన్ చెప్పాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్.. కెరీర్​లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 51 శతకాలతో 15,921 పరుగులు చేశాడు.

Tags:    

Similar News