తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సోనియా సమావేశం

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలను కలవడానికి ఎట్టకేలకు ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ అంగీకరించారు. శనివారం ఆమె ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో సంస్థాగత మార్పు తీసుకురావాలని కోరుతూ 23 మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. వీరితో భేటీ కావడానికి సోనియాగాంధీ అంగీకరించడంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కీలక పాత్ర పోషించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లేఖపై […]

Update: 2020-12-17 10:11 GMT

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలను కలవడానికి ఎట్టకేలకు ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ అంగీకరించారు. శనివారం ఆమె ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో సంస్థాగత మార్పు తీసుకురావాలని కోరుతూ 23 మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. వీరితో భేటీ కావడానికి సోనియాగాంధీ అంగీకరించడంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కీలక పాత్ర పోషించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లేఖపై సంతకం చేసిన 23 మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీ సమావేశమయ్యే అవకాశం లేదు. ముఖ్యమైన ఆరుగురు ఎమ్మెల్యేలతో ఆమె భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ హాజరుపై స్పష్టత లేదు.

Tags:    

Similar News