బీమా సంస్థ కొనుగోలుకు సచిన్ చర్చలు!

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (flipkart) సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్… కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఇన్సూరెన్స్ విభాగం జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కో.లిమిటెడ్ (future generali india life insurance co. ltd) సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సచిన్ బన్సాల్‌కు చెందిన ఆర్థిక సేవల స్టార్టప్ నవీ టెక్నాలజీస్ (Navi Technologies) ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బీమా సంస్థను రూ. 1400-రూ. 1500 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి […]

Update: 2020-08-31 06:01 GMT
బీమా సంస్థ కొనుగోలుకు సచిన్ చర్చలు!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (flipkart) సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్… కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఇన్సూరెన్స్ విభాగం జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కో.లిమిటెడ్ (future generali india life insurance co. ltd) సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సచిన్ బన్సాల్‌కు చెందిన ఆర్థిక సేవల స్టార్టప్ నవీ టెక్నాలజీస్ (Navi Technologies) ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బీమా సంస్థను రూ. 1400-రూ. 1500 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదన దశలోనే ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

ఫ్యూచర్ జనరలి లైఫ్ ఇన్సూరెన్స్ పొందుపరిచిన విలువ రూ. 800 కోట్లు ఉండగా, పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఇప్పుడు 1.5 నుంచి 2 రెట్లు ఎక్కువ అంచనా వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ఇదివరకు జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాల నుంచి నిష్క్రమించే సూచనలున్నాయని గతంలో పలు నివేదికలు తెలిపాయి.

తాజాగా, సచిన్ బన్సాల్ వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. 2018లో ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్, అంకిత్ అగర్వాల్‌తో కలిసి అదే ఏడాది డిసెంబర్‌లో ఆర్థిక సేవల స్టార్టప్ నవీ టెక్నాలజీస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News