క్రితుంగా రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి
దిశ, నాచారం: హబ్సిగూడ చౌరస్తాలోని “క్రితుంగా రెస్టారెంట్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినప్పుడే అందరి మన్ననలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నరేందర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అతిథులను సన్మానించారు. ఆకట్టుకున్న […]
దిశ, నాచారం: హబ్సిగూడ చౌరస్తాలోని “క్రితుంగా రెస్టారెంట్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినప్పుడే అందరి మన్ననలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నరేందర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అతిథులను సన్మానించారు.
ఆకట్టుకున్న మెట్రో రైలు డబ్బాలు..
ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మెట్రో రైలు డబ్బాలు రూపొందించారు. చిన్న ట్రైన్ ద్వారా భోజన సేవలను అందించడానికి అనుకూలంగా తయారు చేశారు. రైలులో భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. చిన్నారులను బాగా ఆకట్టుకుంది.