శ్రీశాంత్ రీఎంట్రీలోనూ అదే తీరు

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం అనంతరం తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాడు. కేరళ జట్టు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడనున్న నేపథ్యంలో అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గురువారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న శ్రీశాంత్ తీరు చూసి ఇతను ఇంకా మారలేదు అని చర్చించుకున్నారు. దానికి కారణం శ్రీశాంత్ తన సహజశైలిలోనే స్లెడ్జింగ్‌కు పాల్పడటమే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సహచర ఆటగాడిపై శ్రీశాంత్ […]

Update: 2021-01-01 09:45 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం అనంతరం తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాడు. కేరళ జట్టు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడనున్న నేపథ్యంలో అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గురువారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న శ్రీశాంత్ తీరు చూసి ఇతను ఇంకా మారలేదు అని చర్చించుకున్నారు. దానికి కారణం శ్రీశాంత్ తన సహజశైలిలోనే స్లెడ్జింగ్‌కు పాల్పడటమే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సహచర ఆటగాడిపై శ్రీశాంత్ స్లెడ్జింగ్‌కి దిగడంలో అందరూ ఆశ్చర్యపోయారు.

కాగా, ఏడేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీశాంత్ తనలో బౌలింగ్ సత్తా లేదని నిరూపించాడు. దూకుడైన ఆటను ఆడుతూ.. పదునైన బంతులు సంధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్లు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం శ్రీశాంత్ ఆటను చూస్తే అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడటం ఖయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రోఫీలో సత్తా చాటి ఐపీఎల్ 2021లో చోటు సంపాదించాలని శ్రీశాంత్ భావిస్తున్నాడు.

 

Tags:    

Similar News