రష్యన్ కాస్మోనాట్‌ను ప్రతిబింబించే బార్బీ బొమ్మ

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న లేటెస్ట్ ఫ్యాషన్స్ ఆధారంగా బొమ్మలను రూపొందించడం బార్బీ సంస్థ ప్రత్యేకత. ఇక ‘బార్బీ’ బొమ్మలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్ణాలకు, లోపాలకు అతీతంగా తయారయ్యే ఈ బార్బీ బొమ్మలను.. తాజాగా లక్ష్యసాధన కోసం ధైర్యంగా, సాహోసోపేతంగా ముందడుగువేసే స్త్రీమూర్తులను ప్రతిబింబించే విధంగా రూపొందించడం విశేషం. ఈ క్రమంలోనే బాలికలు, మహిళల్లో స్ఫూర్తినింపేందుకు రష్యన్ ఫిమేల్ కాస్మోనాట్ అన్నా కికినా రూపంలో బార్బీ బొమ్మను తయారు […]

Update: 2021-03-20 04:41 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న లేటెస్ట్ ఫ్యాషన్స్ ఆధారంగా బొమ్మలను రూపొందించడం బార్బీ సంస్థ ప్రత్యేకత. ఇక ‘బార్బీ’ బొమ్మలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్ణాలకు, లోపాలకు అతీతంగా తయారయ్యే ఈ బార్బీ బొమ్మలను.. తాజాగా లక్ష్యసాధన కోసం ధైర్యంగా, సాహోసోపేతంగా ముందడుగువేసే స్త్రీమూర్తులను ప్రతిబింబించే విధంగా రూపొందించడం విశేషం. ఈ క్రమంలోనే బాలికలు, మహిళల్లో స్ఫూర్తినింపేందుకు రష్యన్ ఫిమేల్ కాస్మోనాట్ అన్నా కికినా రూపంలో బార్బీ బొమ్మను తయారు చేసింది.

సోవియట్ యూనియన్ తమ ఫస్ట్ క్రూయిడ్ స్పేస్‌ను ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా.. బార్బీ సంస్థ రెండు కొత్త బొమ్మలను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా స్పేస్ టీమ్‌లో ఉన్న ఏకైక ఫిమేల్ కాస్మోనాట్ ‘అన్నా కికినా’ రూపంతో బార్బీ బొమ్మలను తయారు చేయగా.. జెట్ బ్లూ, వైట్ ఓర్లాన్ రంగుల్లో రూపొందించిన స్పేస్‌సూట్స్‌పై ఆమె పేరుతో పాటు రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ అధికారిక లోగో ఉండటం విశేషం. 36 ఏళ్ల కాస్మోనాట్ కికినా.. వాలెంటినా తెరెష్కోవా తర్వాత ఐదో మహిళగా 2022లో అంతరిక్షంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు నలుగురు రష్యన్ మహిళలు తెరెష్కోవా (1963లో), స్వెత్లానా సావిట్‌స్కాయా(1982,1984లో), ఎలెనా కొండకోవా (1994-1995, 1997లో), ఎలెనా సెరోవా (2014-2015లో) మాత్రమే అంతరిక్షాన్ని సందర్శించారు.

‘నేను చిన్నతనంలో వ్యోమగామి కావాలని అనుకోలేదు. నా దగ్గర ఆస్ట్రోనాట్ రూపంలో ఉన్న బార్బీ బొమ్మ ఉంటే, ఆ సమయంలో కచ్చితంగా ఆస్ట్రోనాట్ కావాలనే ఆలోచన వచ్చేది. బార్బీ బొమ్మతో ఆడుతున్న ప్రతీ అమ్మాయి వ్యోమగామి కావాలని అనుకోదు. అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వారందరికీ తమకంటూ ఓ చాయిస్ ఉంటుందని నేను భావిస్తున్నా’ అని కికినా పేర్కొన్నారు. కాగా అన్నా కికినా గురించి స్పందించిన రష్యన్ స్పేస్ ఏజన్సీ.. తను చాలా మందికి రోల్ మోడల్, ధైర్యవంతురాలని పేర్కొంటూ సున్నితమైన, తెలివైన, అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఆమెలో ఉందని వెల్లడించింది.

Tags:    

Similar News