రాష్ట్రానికి ఆక్సిజన్​ తీసుకువచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఆక్సిజన్​ ట్యాంకర్లు సోమవారం సాయంత్రం చేరుకున్నాయి. మొత్తం 9 ట్యాంకర్లు, 150 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన ట్యాంకర్లను ముందుగా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు పంపించారు. ఆ తర్వాత కరీంనగర్, చర్లపల్లి, కింగ్​కోఠి, చెస్ట్​ఆస్పత్రి, ఖమ్మం జిల్లాలకు ఈ ఆక్సిజన్​ట్యాంకర్లు చేరుకున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్​నుంచి ఈ ట్యాంకర్లను ఆర్టీసీ డ్రైవర్లు తీసుకువచ్చారు. గ్రేటర్​హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు ట్యాంకర్లను తీసుకువచ్చేందుకు భువనేశ్వర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అదే విధంగా […]

Update: 2021-04-26 06:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఆక్సిజన్​ ట్యాంకర్లు సోమవారం సాయంత్రం చేరుకున్నాయి. మొత్తం 9 ట్యాంకర్లు, 150 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన ట్యాంకర్లను ముందుగా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు పంపించారు. ఆ తర్వాత కరీంనగర్, చర్లపల్లి, కింగ్​కోఠి, చెస్ట్​ఆస్పత్రి, ఖమ్మం జిల్లాలకు ఈ ఆక్సిజన్​ట్యాంకర్లు చేరుకున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్​నుంచి ఈ ట్యాంకర్లను ఆర్టీసీ డ్రైవర్లు తీసుకువచ్చారు. గ్రేటర్​హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు ట్యాంకర్లను తీసుకువచ్చేందుకు భువనేశ్వర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అదే విధంగా సోమవారం రాత్రి కూడా మళ్లీ ఆర్టీసీ డ్రైవర్లు భువనేశ్వర్‌కు వెళ్లినట్లు ఆర్టీసీ హైదరాబాద్​ఈడీ వెంకటేశ్వర్​ రావు తెలిపారు.

ఆక్సిజన్​ ట్యాంకర్లను తీసుకురావడంలో ఆర్టీసీ డ్రైవర్లను వినియోగిస్తున్నామన్నారు. కాగా 150 మెట్రిక్​టన్నుల ఆక్సిజన్‌తో కూడిన 9 ట్యాంకర్లు హైదరాబాద్‌కు చేరుకోవడంతో అన్ని వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా పేషెంట్స్ ఆక్సిజన్​దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిశా నుంచి ఆక్సిజన్‌ను తీసుకువచ్చారు. మరో నాలుగు రోజుల్లో మరిన్ని ట్యాంకర్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. యుద్ధ విమానాల్లో భువనేశ్వర్‌కు వచ్చిన ఆక్సిజన్‌ను ఇక్కడకు తీసుకురావడంలో ఆర్టీసీ డ్రైవర్లు కృషి చేస్తున్నారు.

 

Tags:    

Similar News